నిజంనిప్పులాంటిది

May 07 2023, 10:08

సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు❓️

కేసీఆర్ సర్కారును ఎప్పడూ ఎదో ఓ టెన్షన్ వెంటాడుతూనే ఉంటున్నది. తాజాగా మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రయివేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ జీవో జారీ చేశారు.

ఈ జీవోను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నది. కానీ రెండు రోజులకే ఆ కాపీ బయటకు రావడంతో ప్రగతిభవన్ వర్గాలు షాక్ తిన్నాయి. అది కాస్త ప్రతిపక్షాల చేతికి చిక్కడంతో వారి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు పాటించినా జీవో కాపీ ఎలా బయటకు వచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి కాపీ ఎక్కడి నుంచి లీకైందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణ మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు నెలకు రూ.లక్షన్నర వేతనం అదిస్తున్నట్టు ఈనెల 2వ తేదీన జోవో జారీ అయింది. ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

జీవో కాపీని ఆన్‌లైన్‌లోనూ పెట్టలేదు. అంత వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం ఆ జీవో కాపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆ జీవో కాపీని బయటపెట్టారు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఒక్క సారిగా షాక్ అయినట్టు సమచారం. సీక్రెట్‌గా ఉంచిన జీవో కాపీ ఎలా బయటకు విషయంలో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 07 2023, 10:06

ఈ నగరానికి ఏమైంది❓️

హైదరాబాద్: హైకోర్టు వద్ద అందరూ చూస్తుండగా ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపేశారు. రూ.10 వేల కోసం జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగింది. జవహర్‌నగర్‌లో మద్యంమత్తులో పడిపోయిన వ్యక్తి జేబులోని సెల్‌ఫోన్‌ కోసం అతడి గొంతు నులిమి చంపేశారు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఈ హత్య జరిగింది. చిన్న చిన్న కారణాలకే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. వంద, వెయ్యి కోసం కూడా హత్య చేస్తున్న ఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. నాలుగేళ్లలో పోలీసుల డేటా పరిశీలిస్తే.. సగటున ప్రతి 36 గంటలకు ఓ హత్య.. రోజుకో హత్యాయత్నం జరుగుతోంది.

ఒకప్పుడు ఫ్యాక్షన్‌ పగలు, ప్రతీకారాలు, ముఠా తగాదాలు, గ్యాంగ్‌వార్‌లు, రియల్‌ ఎస్టేట్‌ దందాల వ్యవహారాల్లో హత్యలు జరిగినట్లు రికార్డుల్లో ఉండగా, ఇప్పుడు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు..ఇలా రకరకాల కారణాలతో హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారు కూడా హత్య చేయడానికి వెనకాడటం లేదు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో నాలుగేళ్లలో 980 హత్యలు, 1541 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు సుమారు 80 హత్యలు జరిగినట్లు సమాచారం.

కలకలం సృష్టించిన ఘటనలు

నగరం, శివారు ప్రాంతాల్లో 20 రోజుల్లో రెండు చోట్ల గోనె సంచుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ మృతదేహం పహడీషరీఫ్‌ పరిధిలో లభ్యమైంది. షాద్‌నగర్‌ వద్ద బాలుడు గోనెసంచిలో మృతదేహంగా కనిపించాడు. వీరిని ఎక్కడో చంపి..పడేశారని పోలీస్‌ విచారణలో తేలింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ట్రయాంగిల్‌ లవ్‌ వ్యవహారంలో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

ఫోన్‌ చేయడం లేదని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చందానగర్‌ పీఎస్‌ పరిధిలో ఓ మాల్‌లో పని చేస్తున్న భార్య అంబికను హతమార్చాడు.

తండ్రికి ఇవ్వాల్సిన అప్పు అడుగుతున్నాడని ఆగ్రహంతో ఓ ట్రాన్స్‌జెండర్‌ 8 ఏళ్ళ బాలుడిని దారుణంగా చంపేశాడు.

స్నేహితుల మధ్య విభేదాలతో కుల్సుంపురా పీఎస్‌ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన వీడియో వైరల్‌గా మారింది.

కౌకూర్‌లో పెయింటర్‌ హత్య కేసును జవహర్‌నగర్‌ పోలీసులు కేవలం 6 గంటల్లో ఛేదించారు. సెల్‌ఫోన్‌ కోసమే దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన పడకలూరు సురేశ్‌ (38) పెయింటర్‌. పని చేయగా వచ్చిన డబ్బులతో ఈ నెల 3న అతిగా మద్యం తాగాడు. కౌకూర్‌ పరిధిలోని పాడుబడిన ఇంటి వద్ద పడిపోయాడు. అదే కాలనీలో ఉంటున్న పెయింటర్లు మహారాష్ట్రకు చెందిన అజయ్‌ యువరాజ్‌, రాజు సైతం అతిగా మద్య తాగారు. సురేశ్‌ పడిపోయి ఉండటాన్ని గుర్తించారు. అతడి జేబులోని సెల్‌ఫోన్‌ అమ్మేసి మరింత మద్యం తాగాలని భావించారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ దొంగిలిస్తుండగా సురేశ్‌ వారిని గుర్తించాడు. తాము ఎక్కడ దొరికిపోతామో అని భావించి సురేశ్‌ గొంతును టవల్‌తో గట్టిగా నులిమి చంపేశారు. సెల్‌ఫోన్‌తో పాటు జేబులో ఉన్న రూ. 60 దొంగిలించారు. చనిపోయాడనుకున్న సురేశ్‌ కొద్దిగా కదిలినట్లు అనిపించడంతో పక్కనే ఉన్న గ్రనేట్‌ రాయిని ముఖంపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేవలం 6 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌హెచ్‌వో సీతారామ్‌ తెలిపారు.

సెల్‌ఫోన్‌ విషయంలో వివాదం ఒకరిపై హత్యాయత్నం

సెల్‌ఫోన్‌ విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రామిరెడ్డినగర్‌కు చెందిన నీరుగొండ వెంకటే్‌షగౌడ్‌కు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు

విజయ్‌ అలియాస్‌ విక్కీ(25) చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. మద్యం తాగి, అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడు. తల్లిదండ్రులపై కూడా పలుమార్లు దాడులకు పాల్పడ్డాడు. గతంలో విజయ్‌పై అనేక కేసులు ఉన్నాయి. అతడికి స్థానిక యువకుడు లిల్లీ స్నేహితుడు. లిల్లీ కూడా అనేక కేసుల్లో ఉన్నాడు. ఇటీవలే బిహార్‌ వెళ్లొచ్చిన లిల్లీ.. విజయ్‌తో కలిసి మద్యం కొనుగోలు చేసి హెచ్‌ఎంటీ జంగల్‌ ప్రాంతానికి వెళ్లి తాగుతున్నారు. సెల్‌ఫోన్‌ విషయంలో గొడవ మొదలైంది. అది తీవ్రమై బండరాయి తీసుకుని విజయ్‌ తలపై లిల్లీ బలంగా కొట్టాడు. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విజయ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లిల్లీ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది

నిజంనిప్పులాంటిది

May 07 2023, 10:03

ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్

•5 గంటల్లోపే తిరిగి విమానాశ్రయానికి

యువ సంఘర్షణ పేరుతో ఈ నెల 8న సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్‌ పార్టీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక.. ఆ రోజు తనకున్న టైట్‌ షెడ్యూల్‌లో అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించగలిగారు. ఒక విధంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బెంగళూరు నుంచి సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రియాంకగాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సరూర్‌నగర్‌ స్టేడియానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. ఆ వెంటనే ఆమె హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.30 గంటల ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంటారు.

మొత్తంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి. ప్రియాంక సభ జరిగే 8న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రోజుహైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాంగ్రెస్‌ నేతల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 15:46

ఎస్సీ వర్గీకరణపై మాయావతి వైఖరి స్పష్టం చేయాలి

ఈనెల 7న హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ భరోసా సభకు హాజరవుతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్సీ వర్గీకరణ పై తన వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెస్పీ జిల్లా నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ అన్నారు.

శనివారం స్థానిక ఆర్.అండ్.బి అతిథి గృహములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ....

ఎస్సీలలో ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా ఉండాలనేది కాన్సిరాం సిద్ధాంతమని ఆ సిద్ధాంతానికి బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉంటే బెహన్ మాయావతి తక్షణమే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాలని డిమాండ్ చేశారు.

బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తే చారిత్రక ద్రోహం చేసిన పార్టీగా భావిస్తామని హెచ్చరించారు.

ఇప్పటికైనా బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం పైన దృష్టి సారించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో బీఎస్పీ పార్టీ మాదిగలను దూరం చేసుకున్న పార్టీగా మిగిలిపోతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి లేక ఇచ్చి రాష్ట్రం సిద్ధించేటందుకు చొరవ చూపిన బెహన్ మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలోను సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు బొజ్జ దేవయ్య, కత్తుల సన్నీ, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, సాయి, కొండల్, పబ్బిళ్ళ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:42

విస్తృతంగా వర్షాలు... 11 నుంచి మళ్లీ వడగాడ్పులు

కొనసాగుతున్న ఆవర్తనం..

నేడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం

ఆపై వాయుగుండం, తుపానుగా మార్పు

బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు పయనించే అవకాశం..

11 తర్వాత నుంచి మళ్లీ వడగాడ్పులు

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:13

నేడు పాలమూరులో పర్యటించనున్న ఐటీ మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా

పాలమూరు పారిశ్రామికంగా ఎదిగేందుకు సిద్దపడుతుంది. ఇన్నాళ్లూ ఉపాధికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన యువతకు ఇపుడు ఉన్నచోటేకే పరిశ్రమలు పరుగులుపెడుతూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమ అంటే కేవలం మాధాపూర్‌.. గచ్చిబౌలీ ప్రాంతాలకే పరిమితమం అనుకుంటున్న తరుణంలో పాలమూరులో ఐటీ ఇంకుబ్యేటర్‌ సెంటర్‌ రూపుదిద్దుకుంది. సాంకేతిక ఉపాధి సైతం అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు అమర్‌ రాజా గిగా క్యారిడార్‌కు కూడా భూమిపూజ జరగనుండటంతో.. పాలమూరు యువతకు డబుల్‌ బొనాంజాగా మారింది.

స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా మహబూబ్‌నగర్ లో ఐటీ ఇంకుబ్యేషన్‌, ఎనర్జీ పార్కు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇక్కడ నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్ ప్రారంభోత్సవంతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావిస్తోన్న అమరరాజా గిగా కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ నెల 6న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.టీ.ఆర్‌, స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పనులను ప్రారంభించనుండడంతో అధికారయంత్రాంగం ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

జీవనోపాధిలేక వలసలు పోతున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని యువతకు... స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2018లో దివిటిపల్లి వద్ద 370 ఎకరాల భూమిని ఐటీ, మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించారు. 2018 జులైలో ఈ ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగెకరాల స్థలంలో 40 కోట్ల రూపాయలతో ఇక్కడ ఐదంతస్తుల ఐటీ టవర్‌ను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నిర్మించారు.

ఇక్కడ సార్ట్‌అప్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు ఐటీ సంస్థలను ఆహ్వానించగా.. ఈనెల ఆరు నుంచి కనీసం ఆరు కంపెనీలు ఇక్కడ తమ సంస్థల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించనున్నాయి. ఐతే ఈ ఐటీ టవర్‍ ప్రారంభం కానుండటంతో జిల్లాలోని వద్యార్థుల్లో సంతోషం వ్యక్తమౌతుంది.

ఈ టవర్లోని ఐదు అంతస్థుల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణపు స్థలం అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఇక్కడ నలభై నాలుగు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా పది కాన్ఫరెన్స్‌ హాళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే ఐ.టీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామంటోన్న ప్రభుత్వం ఆదిశగా కార్యాచరణ అమలు చేస్తోంది. ఐటీ టవర్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ కూడా ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు రాబోయే సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్‌లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

ఇదిలాఉండగా దిగ్గజసంస్థ అమరారాజా గ్రూప్ కూడా ఇక్కడే గిగాసెల్‌ కారిడార్‌ను ఏర్పాటుచేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తున్న లిథియం గిసెల్..బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధిత అమరరాజా గిగా కారిడార్‌కు సైతం శనివారం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు.

ఎలక్ట్రికల్ వాహనాల్లో వాడే బ్యాటరీలను పర్యావరణ హితంగా.. ఇక్కడ ఏర్పాటు చేసే కారిడార్‌లో ఉత్పత్తి చేస్తారని పేర్కొంటున్నారు. వచ్చే పదేళ్లలో ఈసంస్థ ఇక్కడ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీని విస్తరించనుందని, ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఒకవైపు ఐటీ ఇంకుబేటర్‌ కంపెనీలు.. మరోవైపు అమరరాజా గీగా కారిడార్ ఏర్పాట్లతో పాలమూరు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారుతుందనే ఆశ నిరుద్యోగుల్లో చిగురిస్తోంది.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 12:00

మహానగరంలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో ఇదే అంశంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:58

చీకట్లో జీవోలు

వివిధ శాఖల్లో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు 10 ప్రభుత్వ శాఖల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ఏప్రిల్‌ 30న రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్‌ 38ను జారీ చేసింది. వాస్తవంగా అయితే ఈ జీవో.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ అయిన http://goir.telangana.gov.inలో కనపడాలి. కానీ కనిపించట్లేదు.

ఐఏఎస్‌ అధికారులు కోరెం అశోక్‌రెడ్డి, బి.గోపి, ఆశిష్‌ సంగ్వాన్‌లను బదిలీ చేసి, పోస్టింగులిస్తూ ఏప్రిల్‌ 28న సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో నంబర్‌ 613 జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎ్‌సలు కె.హైమావతి, ఎం.సత్య శారదా దేవి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని అందులోనే ఆదేశించింది. ఇదీ కనిపించుట లేదు.

మహారాష్ట్రకు చెందిన శరద్‌ మర్కడ్‌ను ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీ(పీఎ్‌స)గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 647 జారీ చేసింది. ఈ జీవోను మే 2న జారీచేసినట్లు పేర్కొన్నప్పటికీ... శుక్రవారం (5న) వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు వచ్చింది.

..ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో! తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సిన ఇలాంటి జీవోలు చాలానే సర్కారీ వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా జీవో రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ, పలు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోంది. ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. ప్రభుత్వ పథకానికి సంబంధించినవి, భూసేకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బదిలీలు, నియామకాలు, నిధుల విడుదల, ఉద్యోగాలకు అనుమతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా ప్రతి కీలకమైన జీవోను దాచి పెడుతోంది. వాట్సాప్‌ గ్రూపులు లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వాట్సాప్‌ గ్రూపు ద్వారామాత్రమే వాటిని బయటపెడుతోంది. అదీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదనుకునే జీవోలను మాత్రమే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటకు తెస్తున్నారు. వివాదాస్పద జీవో అనుకుంటే.. దానిని అసలు బయటే పెట్టడం లేదని, ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

పారదర్శకత కోసం

పాలనలో పారదర్శకతే లక్ష్యంగా చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పెట్టడం ప్రారంభించాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా http://goir.telangana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలన్నింటి నుంచీ కలిపి ఏటా 6000 నుంచి 8000 దాకా జీవోలు వెలువడుతుంటాయి. అయితే, వీటిలో.. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ముఖ్యమైన నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎ్‌సలు, ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టుల భర్తీకి అనుమతులు వంటి అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవోలను మాత్రం ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేయట్లేదు.

హైకోర్టు సీరియస్‌

2014 జూన్‌ 2 నుంచి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం 1,04,171 జీవోలు వెలువడగా.. వాటిలో 43,462 జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదంటూ 2019లో పేరాల శేఖర్‌రావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) వేశారు. దీనిపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రజలకు తెలియాల్సిన జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)ను ప్రశ్నించింది. మిస్సింగ్‌ జీవోలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి సంబంధించిన జీవోను సైతం వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంతో.. ‘వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్‌ వేసింది. దీనిపై 2021 ఆగస్టులో స్పందించిన హైకోర్టు... 24 గంటల్లో జీవోను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 5 వరకు మొత్తం 35 రోజుల్లో దాదాపు 250 వరకు జీవోలు వెలువరించినట్లు సమాచారం. కానీ.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించని 163 రొటీన్‌ జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చేఅవకాశం లేని జీవోలు కాబట్టే వాటిని ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:55

నేడు అమరరాజా పరిశ్రమకు KTR శంకుస్థాపన

నేడు మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ప్లాంటుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టేనబుల్ మొబిలిటీకి తెలంగాణ కేంద్రంగా మారెందుకు ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు..

ఈ రంగంలో ఇండియాలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటని తెలిపారు. ఇందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు అమర రాజా యజమాని గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు. అలాగే, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో ఐటీ టవర్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచన చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే మహబూబ్నగర్కు ఐటీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 06 2023, 11:53

జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఇదిలా ఉంటే నిన్న ప్రారంభం అయిన రాజౌరి ఎన్‌కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ముందుగా ఇద్దరు సైనికులు మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు సైనికులు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

శుక్రవారం మరణించినవారిలో నలుగురు 9 పారా(స్పెషల్ ఫోర్సెస్)కి చెందిన కమాండోలు కాగా.. ఒకరు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్స్ కు చెందిన వారు. ఏప్రిల్ 20న పూంచ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భద్రతాబలగాలు ఉగ్రవాదులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్లు ఓటు చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి వరసగా నాలుగురోజులుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

అంతకుముందు గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను స్థానికులుగా గుర్తించారు. వీరిద్దరు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నారు. షోఫియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ గా గుర్తించారు. 2023లో ఇద్దరూ ఉగ్రవాదంలోకి చేరారు. బుధవారం కుప్వారాలోని పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం, కాశ్మీర్ పోలీసులు హతమార్చారు.